Mahaa Daily Exclusive

  Battula prabhakar: దక్షిణాది రాష్ట్రాల్లో 80 దొంగతనాలు , మూడు తుపాకులు, 428 బుల్లెట్లు స్వాధీనం…!

Share

గచ్చిబౌలీలోని ఫ్రీజం పబ్ లో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు అసాధ్యుడని పోలీసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ పాత నేరస్థుడు. 2013 నుంచి అనేక నేరాలతో సంబంధం ఉంది. అతడిపై ఏపీ, తెలంగాణలో దాదాపు 80 కేసులు నమోదయ్యాయి. 2022 మార్చిలో విచారణ నిమిత్తం పోలీసులు విశాఖపట్టణం జైలు నుంచి అనకాపల్లికి తీసుకు వెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయాడు. అప్పటి నుంచి ఏపీ పోలీసులు ప్రభాకర్ కోసం వెతుకుతున్నారు. పోలీసులకు కనపడకుండా తిరుగుతున్న ప్రభాకర్ బీహార్ గ్యాంగ్ నుంచి మూడు తుపాకులు కొనుగోలు చేశాడు. అనంతరం తిరిగి దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించాడు. పేరొందిన ఇంజనీరింగ్ కళాశాలలే టార్గెట్ గా ప్రభాకర్ చోరీలకు పాల్పడుతున్నాడు. కళాశాలల్లో ప్రవేశాలు, పరీక్షలు, హాస్టల్ ఫీజుల వసూళ్ళు లాంటి డబ్బులు నిలువ ఉంటాయన్న విషయాన్ని ఫసిగట్టి చోరీలకు పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా నార్సింగి, మొయినాబాద్ తదితర ప్రాంతాలలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో జరిగిన దొంగతనాలలో పోలీసులు వేలి ముద్రలను సరిపోల్చగా ప్రభాకర్ వేలి ముద్రలతో సరితూగాయి. దీంతో పోలీసులు అతడిపై ప్రత్యేక నిఘా పెట్టారు. చోరీలకు పాల్పడగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసే అలవాటున్న ప్రభాకర్ కోసం గాలిస్తున్న పోలీసులు గచ్చిబౌలితో పాటు నగరంలోనూ, శివార్లలోనూ ఉన్న పబ్ లు, పేరొందిన బార్లు తదితర వాటిల్లో పని చేసే సిబ్బందికి ప్రభాకర్ ఫొటోలను ఇచ్చి వస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంనో ప్రజీం పబ్ కు వెళ్ళిన ప్రభాకర్ సమాచారం పోలీసులకు అందడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు రావడం, క్రమంలో పోలీసులపై కాల్పులకు తెగబడి తప్పించుకునేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు.

ఘటనా స్థలంలోనే ప్రభాకర్ ను పట్టుకున్న పోలీసులు నిందితుడి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడి గదిని సోదా చేయగా మరో తుపాకీ బయటపడింది. నిందితుడు ప్రభాకర్ కొంత కాలంగా ఐటీ కంపెనీలో పని చేస్తున్న తన మిత్రుడి గదిలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాఖపట్టణం జైల్లో ఉన్న సమయంలో ప్రభాకర్ ను తోటి ఖైదీ వేధింపులకు గురి చేశాడని, అతడిని హత్య ఛేసేందుకు పథకం వేసిన ప్రభాకర్ బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ 66 కేసుల్లో నిందితుడని, మరో 28 కేసులు విచారణలో ఉన్నాయని. అతడి వద్ద నుంచి మూడు తుపాకులు, 428 బుల్లెట్ లను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.

Latest