Mahaa Daily Exclusive

  మతపరమైన విభజన సృష్టించి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోంది: ఉత్తమ్

Share

దేశంలో మతపరమైన విభజన సృష్టించి బీజేపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. పార్లమెంటులో ప్రతిపక్షాలకు గొంతు వినిపించే అవకాశం లేదని విమర్శించారు. స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్న ఈ ధోరణిలో కాంగ్రెస్ శ్రేణులు జైబాపు, జైభీమ్‌, జై సంవిధాన్‌ నినాదాలతో ముందుకుపోవాలని పిలుపునిచ్చారు. HYDలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.