Mahaa Daily Exclusive

  అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్: మంత్రి నారాయణ

Share

రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు, హడ్కో రుణాలు ఇస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, దీనికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.48వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మార్చి 10న ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.