Mahaa Daily Exclusive

  దేశంలో కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోంది : మీనాక్షి నటరాజన్

Share

ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ సమస్యల పైన ప్రభుత్వాలను, పాలకులను ప్రశ్నించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదని తెలిపింది. పర్యావరణ, ఉద్యమకారులు మేధాపత్కర్ లాంటి వారు మూసీ నది పరివాహక ప్రాంతంలో పర్యటించడానికి వెళ్లారు. అది గొప్ప విషయం.. ఉద్యమాల్లో నేను మీతో కలిసి పని చేస్తానని ఆమె వెల్లడించింది. ప్రతీ ఒక్కరికీ ప్రశ్నలను లేవనెత్తే హక్కులు ఉన్నాయన్నారు. హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సదస్సులో మాట్లాడిన మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోందని ఆరోపించారు. దేశంలో కోటీశ్వరులు, సామాన్యులు ఒకే టాక్స్ కడుతున్నారు. అంబానీ, అదానీ, పాకెట్ కొనుగోలు చేసే సామాన్యులు సమానంగా టాక్స్ లు కడుతున్నారు. ఈ విధానాలు మారాలన్నారు. అలాగే దేశ ప్రజలు భారత్ మాతాకి జై అంటున్నారు. కానీ సామాన్యులకు వారి నిర్ణయాలకు చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొందరు వ్యక్తుల నిర్ణయాల మేరకే పని చేస్తుందని, మెజారిటీ ప్రజల అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. వ్యక్తుల సామూహిక అభిప్రాయాలకు కాకుండా వ్యక్తుల అభిప్రాయాలకే విలువ ఇవ్వడం బాధాకరమన్నారు.