Mahaa Daily Exclusive

  ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం నేటి నుండి ప్రారంభం

Share

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు బోర్డ్ సర్వం సిద్దం చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు.. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి మొదలవనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో అబ్బాయిలు 4,97,528 మంది ఉండగా.. అమ్మాయిలు 4,99,443 మంది ఉన్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు1,532 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.