నియోజకవర్గ అభివృద్ధి కాకుండా స్వంత అభివృద్ధికే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రాదాన్యమిస్తూ ప్రజలకు కంటగింపు పనులను చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడిన అర్వింద్ మాట్లాడుతూ, ప్రతి అధికారిని, నాయకులు, కార్యకర్తలను, సాధారణ ప్రజలను మతం పేరుతో తిట్టడమే సుదర్శన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలతో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేస్తే నిజామాబాద్ పార్లమెంట్ కు రెండు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చామని తెలిపారు. జిల్లా మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో జక్రాన్ పల్లి మండలం కలిగోట్ వద్ద నవోదయ ఏర్పాటు చేయాలని దానికి తమ పార్టీ ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి ఒప్పించి మంజూరు చేయించామని పేర్కొన్నారు. ఈ విషయంపై తాము సిఎం రేవంత్ రెడ్డి కలిసి అందుకు సంబంధించిన స్థలం కోసం మాట్లాడానని, నికి సీఎం వెంటనే స్థలానికి అనుమతులు ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశారన్నారు. అయితే రూరల్ నియోజకవర్గంలో విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలం కూడా చూపించారన్నారు. బోధన్ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజావసరాల కోసం కేంద్రం నుంచి ప్రాజెక్టులు నిధులు తీసుకు వస్తుంటే ఎమ్మెల్యే అడ్డుకుంటూ స్వప్రయోజనాల కోసం పాకులాడటం బాధాకరమన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో స్థానిక ఎమ్మెల్యే స్వంతంగా ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, అందుకే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలిపించేందుకు సుముకంగా లేరన్నారు. ఫ్యాక్టరీని తెరిపిస్తే స్థానిక రైతాంగానికి ఉపయోగపడటంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.








