Mahaa Daily Exclusive

  సంపద, వనరులు అందని వర్గాలు ఏవో విశ్లేషణ చేయండి స్వతంత్ర, మేధావుల కమిటీని కోరిన డిప్యూటీ సీఎం …!

Share

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వచ్చిన సమాచారాన్ని, అంకెలు, సంఖ్యల ఆధారంగా సర్వే నివేదికను సంపూర్ణంగా అధ్యయనం చేయాలని స్వతంత్ర, మేధావుల కమిటీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. సర్వే సమాచారం మేరకు ఏ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా తరతరాలుగా వెనుకబడి ఉన్నాయో, రాష్ట్ర వనరులు అందుబాటులో లేకుండా, ఏ వర్గాలు దూరంగా ఉన్నాయో సమాజంలో అన్ని వర్గాల వారీగా విశ్లేషణ చేసి నెల రోజుల వ్యవధిలో నివేదిక అందజేయాలని కమిటీని కోరారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా, ప్రొఫెసర్ కంచ ఐలయ్య వైస్ చైర్మన్ గా, ప్రవీణ్ చక్రవర్తి కన్వీనర్ గా, ప్రొఫెసర్ సుఖదేవు తొరట్, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్ శాంత సిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, ప్రొఫెసర్ భూక్య భగ్య, ప్రత్యేక ఆహ్వానితులుగా జీన్ డ్రీజ్ లతో స్వతంత్ర హోదా కలిగిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.