Mahaa Daily Exclusive

  బీజేపీలో రాజాసింగ్ కలకలం రోజుకో రకమైన వ్యాఖ్యలు సీఎం కలుస్తున్న నేతలెవరు …?

Share

రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు బీజేపీ వీరోచిత పోరాటం చేస్తోంది. ప్రదాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ రోజురోజుకూ ప్రజాధరణ కోల్పోతుండటంతో ఆ గ్యాప్ లోకి చొచ్చుకుపోవాలని కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు నాయకత్వం ఎప్పటికప్పుడు మార్గ నిర్ధేశం చేస్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ే ఎన్నికలు వచ్చినా తప్పనిసరిగా పోటీ చేయడంతో గెలుపే లక్ష్యంగా పని చేసేందుకు క్షేథ్రస్థాయి నాయకులకు సలహాలు, సూచనలను కూడా ఇస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళడంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హామీల అమలు వైఫల్యాలను ఎలుగెత్తి చాటేందుకు పార్టీ కార్యాచరణలో నిమగ్నమైంది.

ఇవన్నీ ఒక ఎత్తైతే గోషామహల్ ఎమ్మెల్యే ఖట్టర్ హిందూత్వవాది రాజాసింగ్ వ్యవహారం రోజురోజుకూ శృతి మించుతుండటంతో కాషాయ దళంలో కలకలం మొదలైంది. గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్ అఇప్పుడప్పుడు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు వ్యాఖ్యలు చేయడం సహజమైంది. అయితే ఇటీవల కాలంలో ఆయన వ్యాఖ్యలు పార్టీని ఇరుకున పెట్టేవిగా ఉండటంతో అధిష్టానం అప్రమత్తమైంది. పార్టీకి కొరకరాని కొయ్యలా తయారవడంతో ఆయనను ఎలా దారికి తీసుకు రావాలన్న అంశంపై పార్టీలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందంటూనే పాత సామాన్లుగా ఉన్న కొంత మంది నేతలను పక్కకు తప్పించాలని, నాయకత్వం బాధ్యతలను కొత్త వారికి అప్పగించాలని వ్యాఖ్యానించడం సంచలనంగా మరింది. వాస్తవానికి గత కొన్నాళ్ళుగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజాసింగ్ కు మధ్య విబేధాలు బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంత కాలం రాజాసింగ్ బీజేపీకి విదేయుడిగానే వ్యవహరించారు. తిరిగి కిషన్ రెడ్డి పార్టీ పగ్గాలు అప్పగించినప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు. తాజాగా రాజాసింగ్ పార్టీలో కోవర్టున్నారని, వారు తమ పనుల కోసం రహస్యంగా సీఎంను కలుస్తున్నారంటూ బాంబు పేల్చారు. అంతేకాకుండా సరైన సమయంలో ఆధఘారాలన్నింటినీ అధిష్టానంకు ఇస్తానని చెప్పడం తీవ్ర చర్చ నీయాంశంగా మారింది. బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అంటుంటే, బీజేపీ – కాంగ్రెస్ ఒక్కటేనని బీఆర్ఎస్ పదే పదే అంటోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ నేతలు కొంత మంది రహస్యంగా భేటీ ఆవుతున్నారని, రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా ఉందన్న చర్చ కూడా మొదలైంది. సీఎంను రహస్యంగా కలుస్తున్ నపార్టీ నేతలు ఎవరన్న అంశంపై చర్చ జోరందుకుంది. అంతే కాకుండా పార్టీలో ఉన్న స్క్రాప్ ఎవరు, స్క్రాప్ ద్వారా పార్టీకి ఏ రకంగా నష్టం జరుగుతుందన్న చర్చ మొదలైంది. మొత్తంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్న బీజేపీకి రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీని సంకటంలోకి నెట్టేశాయి. రాజాసింగ్ వ్యాఖ్య.లలో వాస్తవమెంత అన్న అంశంపై అధిష్టానం ఆరా మొదలు పెట్టింది.