Mahaa Daily Exclusive

  హిందూ సమాజం ఒకేతాటిపై ఉండాలి గాలినీరునిప్పుతో పరిహాసమొద్దు హోలీవేడుకల్లో – బండిసంజయ్

Share

కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌ లోని బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలు, కార్యకర్తలు అభిమానులతో కలిసి రంగుల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోలీ పండుగ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలు, హిందు బంధువులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశ వ్యాప్తంగా హోలీ పండుగను వైభవోపేతంగా జరుపుకుటున్నారని అన్నారు. ఎల్లప్పుడు హిందూ సమాజం ఓకే తాటిపై ఉండాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. ఆపద వచ్చినా.. హిందు ధర్మానికి అవమానం కలిగినా.. అంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కులాలకు అతీతంగా అంతా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. పండుగ పూట గాలి, నీరు, నిప్పుతో పరిహాసం వద్దని.. స్నానాలు చేసేందుకు యువత చెరువులు, నదుల వెళ్లి ప్రాణాలు పొగొట్టుకోవద్దని సూచించారు.