Mahaa Daily Exclusive

  జగదీశ్ రెడ్డి.. మొగోనివైతే రాజీనామా చెయ్ టిడిసి ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి…!

Share

జగదీష్ రెడ్డి ని ఈ ఒక్క సెషన్ కాదని, జగదీష్ రెడ్డి సభ్యత్వం పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ జగదీష్ రెడ్డి బలుపు తగ్గలేదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులను అవమానించే చరిత్ర కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఉందన్నారు. అధికారం పోయి, వేల కోట్లు సంపాదించుకోలేక పోతున్నానని జగదీష్ రెడ్డి ఏడుస్తున్నాడన్నారు. జగదీష్ రెడ్డి అదృష్టంతో గెలుస్తున్నాడు తప్ప.. ఎప్పుడు 30శాతం ఓట్లు రాలేదని మండిపడ్డారు. వేల కోట్ల ఆస్తులు సంపాదించారని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, జగదీష్ రెడ్డి కి దమ్ముంటే.. రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎవరు చేసింది కరెక్ట్ అనేది ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారని, నువ్ నాయకునివైతే, మొగోనివైతే రాజీనామా చెయ్ అంటూ పటేల్ రమేష్ రెడ్డి సవాల్ చేశారు.