శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఐడు రోజుల పాటు అధికారులు జరిపిన సోదాలలో ఈ విషయం బయటపడింది. సోదాలలో ఐదు కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు అనేక కీలక విషయాలను కూడా గుర్తించారు. కేవలం ఏడాది కాలంలో 230 కోట్లతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన శ్రీ చైతన్య యాజమాన్యం. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ఆస్తులు కొనుగోలు.చేసినట్లు వెల్లడైంది. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుకు రెండు సాఫ్ట్వేర్లు ఏర్పాటు చేసుకున్న కాలేజ్ యాజమాన్యం టాక్స్ చెల్లించేందుకు ఒక సాఫ్ట్వేర్, టాక్స్ చెల్లించకుండా ఉండేందుకై మరొక సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేసుకున్న శ్రీ చైతన్య యాజమాన్యం. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో వందల కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
Post Views: 71








