కేసీఆర్ పరిపాలనలో తప్పులు.. అప్పులే చేశారు. ఈ 15 నెలల కాలమంతా కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులు సరిచేయడానికే సరిపోయింది. మేము అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపాలనుకోవట్లేదు. ప్రజలే మా బాసులు.. నన్ను సీఎం కుర్చీలో కూర్చొపెట్టిన ప్రజలకు నేను జవాబుదారిగా ఉంటా. కేసీఆర్‌కు ఉన్నంత వయసు, అనుభవం నాకు లేదు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నాకున్న పరిమిత జ్ఞానంతోనే చర్చిస్తా. ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించే శక్తి మాకు ఉంది. మీ దొంగ ఆస్తులు బయటపడతాయనే కులగణనలో పాల్గొనలేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులతో కులగణన చేయించాం. సమగ్ర కుటుంబ సర్వే ఎవరితో చేయించారో కేసీఆర్ చెప్పగలరా? సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే మీకు దుఃఖం ఎందుకు? అంటూ సీఎం సభలో ఫైరయ్యారు.
…….
కమీషన్లు తీసుకుని నగరాన్ని సర్వనాశనం చేశారు
: సీఎం
ఎలక్ట్రిక్ వాహనాలకు జీరో పన్ను చేశాం. చెరువులు, కుంటలను మీరు మాయం చేశారు. చెరువులు, కుంటలను పునరుద్ధరించాలని చూస్తే గగ్గోలు పెడుతున్నారు. అపార్టుమెంట్లకు తగినట్లు డ్రెయినేజీ వ్యవస్థ ఉందా? కమీషన్లు తీసుకుని నగరాన్ని సర్వనాశనం చేశారు. లెక్క లేకుండా అనుమతులిచ్చి గందరగోళం చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశాం. ప్రపంచ దేశాలతో పోటీపడేలా నగరాన్ని నిర్మించాలని చూస్తే అడ్డంపడుతున్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటే అడ్డుపడుతున్నారు. కేసీఆర్ సలహాలు, సూచనలు ఇస్తే పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం. అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చెప్పినవి పాటిస్తాం. అప్పులు పెండింగ్ పెట్టి పారిపోతే మేము కట్టుకుంటున్నాం. వాళ్లు పెట్టిన అప్పులకు వడ్డీలు కట్టడమే భారంగా ఉంది. అప్పులు పెట్టింది కాకుండా తిరిగి మాపైనే విమర్శలు చేస్తున్నారు. డిస్కంలకు, సింగరేణి, కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టి పోయారు. రూ.8 లక్షల కోట్లు అప్పులు మాపై వేసి పారిపోయారు
లక్షా 52 వేల కోట్లు అప్పు చేశారని మాపై బురద జల్లుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ అప్పు 7 లక్షల 38 వేల 707 కోట్లు ఉంది అని సీఎం రేవంత్ వివరించారు.
…..
నేను ప్రధానిని కలవడంలో రాజకీయమేముంది ? : సీఎం
ప్రధాని మోదీ.. రాష్ట్రాల సీఎంలకు పెద్దన్నలాంటి వారే. రాష్ట్రాల కూడికనే కేంద్రం. ప్రధాని, కేంద్రమంత్రివర్గ నిర్ణయాలు.. రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. నేను ప్రధానిని కలవడంలో రాజకీయమేముంది ? కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిశా. ప్రధానిని గౌరవించే విజ్ఞత మాది. ఢిల్లీ పర్యటన పేరుతో దుబారా చేయట్లేదు. రాజకీయాలకు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ నేతను, ఆయన బీజేపీ నాయకుడు. అవసరమైతే మహేశ్వర్‌రెడ్డిని తీసుకుని ఢిల్లీ వెళ్తాం. కిషన్‌రెడ్డిని నాలుగుసార్లు కలిశాం. నిర్మలసీతారామన్, అమిత్‌షాను కూడా కలిశాం. వరంగల్ ఎయిర్‌పోర్టు నేను తెచ్చిందే కదా? ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం టెండర్లకు వచ్చింది నావల్ల కదా? రక్షణశాఖకు సంబంధించిన భూ బదలాయింపు జరిగింది మా పాలనలోనే
నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని సీఎం రేవంత్ చెప్పారు.
……..
మహేశ్వర్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు.. రేపైనా మాతోపాటు కూర్చుంటారు: సీఎం
మహేశ్వర్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు..ఈరోజు కాకున్నా రేపైనా మాతోపాటు కూర్చుంటారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. రుణమాఫీ, పండించిన పంటలు, కొనుగోలు చేసిన పంటల గురించి చర్చకు సిద్ధంగా ఉన్నాం. విధానపరమైన నిర్ణయాలు, వ్యవసాయ పాలసీ, ఎనర్జీ పాలసీ గురించి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. చంద్రశేఖర్‌రావును తారీఖు చెప్పమనండి. రైతులు, ఇతర ఏ అంశంపైనా సరే కేసీఆర్ చర్చ కోసం సూచన చేస్తే సిద్ధంగా ఉన్నాం. మహాలక్ష్మీ పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నాం. మహాలక్ష్మీ పథకం కింద రూ. 5,500కోట్లు ఆర్టీసీకి చెల్లించాం. 50లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మహిళలను లక్షాధికారులను చేయాలన్న సంకల్పంతో 1000 ఆర్టీసీ బస్సులు అందించాం. అదానీ, అంబానీలతో పోటీపడేలా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు ఆడబిడ్డలతో చేయించాం
ఆడబిడ్డలు ఆనాడు ఇందిరమ్మను అమ్మ అన్నారు.. ఎన్టీఆర్‌ను అన్న అన్నారు…ఇవాళ నన్ను రేవంతన్నా అని పిలుస్తున్నార.
……….
బీఆర్ఎస్ మార్చురీలో ఉందని అన్నా: సీఎం
మీ స్టేచర్ పట్ల ఉన్న ఆలోచన.. స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా. ఆనాడు అధికార పార్టీగా బీఆర్ఎస్కు స్టేచర్ ఉండేది. 2023 డిసెంబర్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా స్టేచర్ ఇచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా ఇచ్చి మార్చురీకి పంపించారు. బీఆర్ఎస్కు ఆనాడు అధికార స్టేచర్…ఆ తర్వాత ప్రతిపక్ష స్టేచర్..గుండు సున్నా వచ్చిన తర్వాత మార్చురీలోకి వెళ్లిందని అన్నాను. బీఆర్ఎస్ నేడు మార్చురీలో ఉందని చెప్పాను..అందులో తప్పేముంది. బీఆర్ఎస్ మార్చురీలో ఉందని నేను చెబితే..పెద్దాయన కేసీఆర్‌ను నేను అన్నట్లుగా కేటీఆర్, హరీశ్‌రావు చిత్రీకరించారు. అంత కుంచిత స్వభావం నాకు లేదు. చంద్రశేఖర్‌రావు వద్ద ఉన్న కుర్చీని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు గుంజుకుని నన్ను కూర్చోబెట్టారు. చంద్రశేఖర్‌రావు వద్ద తీసుకోవడానికి ఇంకేముంది. వారి వద్ద ఉన్నది ప్రధాన ప్రతిపక్షహోదా..ఆ హోదా కేటీఆర్ లేదా హరీశ్‌రావుకు కావాలి. తప్పుడు మాటలు నాకు ఆపాదిస్తున్నారు..నేను అలా కోరుకోవడం లేదు. కేసీఆర్.. వందేళ్లు ఆయురోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలి… నేను ఇక్కడనే ఉండాలి. చంద్రశేఖర్‌రావు సూచనలు చేస్తూనే ఉండాలి…నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు








