సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మాజీ సీఎం కేసీఆర్కు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘మాజీ సీఎంను మార్చురీ పంపిస్తామని అన్నారు. నిన్న అసెంబ్లీలో మాటమార్చి.. తాను కేసీఆర్ను అనలేదని, బీఆర్ఎస్ పార్టీని అన్నట్లు చెప్పారు. రుణమాఫీపై తప్పుడు లెక్కలు చెప్పారు. పూర్తిగా రుణమాఫీ చేస్తారో సమాధానమే లేదు’ అని విమర్శించారు.
Post Views: 120








