Mahaa Daily Exclusive

  పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు కవిత రిక్వెస్ట్ ..!

Share

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌన్సిల్ లో పలు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. మెప్మా పరిధిలో పనిచేస్తున్న ఆర్పీల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, అధికారుల ఒత్తిడి, వెట్టిచాకిరీ అరికట్టాలని ఆర్పీల సంక్షేమ సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఆర్పీల గౌరవ వేతన పెంపు, పీఆర్ సీ అమలు, ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగసంఘం నేతలతో పాటు కవిత ఈ కార్యక్రమంలో పాల్గొని, న్యాయం చేయాలని కోరారు.