Mahaa Daily Exclusive

  ఎస్సీ వర్గీకరణ అమలే అంబేద్కర్ కు ఘన నివాళి సీఎం రేవంత్…!

Share

ఎస్సీ వర్గీకరణ అమలు చేయడమే అంబేద్కర్ కు ఘన నివాళి అని సీఎం రేవంత్ అన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుని విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మోత్కుపల్లి నర్సింహులు, పలువురు నేతలు పాల్గొని బాబాసాహెబ్ సామాజిక సమానత్వ సందేశాన్ని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు.