తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఏమైంది? నిట్టనిలువునా మోసపోయామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో రాజేంద్రనగర్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం, కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సంవత్సరమే ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ అక్కడ బీఆర్‌ఎస్ గెలవాలి. తెలంగాణలో ఉప ఎన్నికలు రావు అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మరుసటి రోజు లైన్ దాటితే తాట తీస్తామని సుప్రీంకోర్టు జడ్జి అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సుప్రీంకోర్టు ఊరుకుంటుందా? కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ గుండెలు జారేలా బీఆర్‌ఎస్ శ్రేణులు వరంగల్ సభకు కదలాలి. వరంగల్‌లో 1250 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. వరంగల్ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడతారు అని అన్నారు.







