వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి మీటింగ్ లో పాల్గొని బీజేపీపై విషం చిమ్మారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. మజ్లిస్ నేతలు విష సర్పాల కంటే డేంజర్ అని, ముస్లిం ఓట్లను దండుకుని ముస్లింలను ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఈ ఇవాళ పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న దారుస్సాలంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిర్వహించిన బహిరంగ సభపై కౌంటర్ ఇచ్చారు. మజ్లిస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ కార్యక్రమమని, ఈ మీటింగ్ కు కర్త, కర్మ, క్రియ అంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ మీటింగ్ కు ఆర్ధిక సాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
Post Views: 102







