సీతారామ ఎత్తిపోతల పథకానికి సాంకేతిక అనుమతులు లభించాయి. ఈ పథకానికి అనుమతులివ్వాలని కేంద్ర జల సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సీతమ్మసాగర్ ఆనకట్టకు కూడా అనుమతులివ్వాలని సిఫారసులో పేర్కొంది. ఢిల్లీలో కేంద్ర జల సంఘంతో జరిగిన సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఈఎన్‌సీ, ఇంజినీర్లు పాల్గొన్నారు. సీతారామ ఎత్తిపోతల ద్వారా 7.87లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 67టీఎంసీలతో సీతారామ ఎత్తిపోతల ద్వారా భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు తాగు, సాగునీరు అందుతాయి. అలాగే.. సాగర్, వైరా, పాలేరు ఆయకట్టులను స్థిరీకరించొచ్చు.
Post Views: 51








