Mahaa Daily Exclusive

  పోలీస్ సిబ్బందికి ఆటోమేటెడ్ మల్టీ-మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ శిక్షణ..!

Share

ఖమ్మం – మహా.
ఆటోమేటెడ్ మల్టీ-మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది నేరం జరిగిన ప్రదేశాల నుండి నేరస్థుల వేలిముద్రలు, అరచేతి ముద్రలు మరియు ఐరిస్ స్కాన్ డేటా ఆధారంగా నేరాలను గుర్తించడానికి ఒక అధునాతన నేర గుర్తింపు వ్యవస్థ అని క్లూస్ టిమ్ ఇన్స్‌పెక్టర్ నరేష్ తెలిపారు.

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బందికి AMBIS యొక్క సాంకేతికత పరిజ్ఞానాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకునేందుకు ఒకరోజు శిక్షణ తరగతులు పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించారు.

ఫింగర్-ఇంప్రెషన్ మరియు పామ్-ప్రింట్ ముద్రలను ఉపయోగించి నేరస్థులను గుర్తించడానికి తెలంగాణ పోలీసులు AFIS (ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్) ను ఉపయోగిస్తున్నారు.

కొత్త క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) యాక్ట్, 2022 అమలులో భాగంగా, తెలంగాణ పోలీసులు తన సాంకేతికతను ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (అంబిస్) కు అప్‌గ్రేడ్ చేశారని తెలిపారు. బయోమెట్రిక్ డేటా సేకరణ యొక్క పరిధిని విస్తరించి, ఇందులో ఐరిస్, ముఖం, పాద ముద్రలు, భౌతిక కొలతల నిల్వ (ఎత్తు మరియు బరువు), సంతకాలు మరియు చేతివ్రాతలు గుర్తించటం జరుగుతుంది.

పోలీసు పెట్రోలింగ్ బృందం మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ఉపయోగించడం ద్వారా అనుమానితుడికి నేర చరిత్రలు ఉన్నాయా లేదా అనేది అక్కడికక్కడే నిర్ధారించగలదని తెలిపారు.

నేరం జరిగిన ప్రదేశంలో వేలిముద్రల ఆధారంగా నేరాన్ని గుర్తించడంతో పాటు, ఈ విధానం 100% ఖచ్చితత్వంతో నేరస్థులను గుర్తించడంలో సహాయపడుతుందని తెలిపారు