ఖమ్మం, మే -07 , మహా.
నెలవారి తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గల ఈ.వి.ఎం. గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి బుధవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గోడౌన్ రూం సీల్ ను పరిశీలించి, భద్రతా సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, భద్రతా సిబ్బంది షిఫ్టుల వారీగా డ్యూటీలో ఖచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.
జిల్లా కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డిటి అన్సారీ, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.
Post Views: 27








