Mahaa Daily Exclusive

  ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణ పనుల శంకుస్థాపనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..!

Share

ఖమ్మం – మహా
మే -8 న నిర్వహించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం, మంత్రుల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేశారు. డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన ఏర్పాట్లను ఆదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, మాతా శిశు సంరక్షణ కేంద్రం, జిల్లా ఆసుపత్రిని కలియతిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మే 8న జిల్లాలో వైద్యారోగ్యశాఖ సంబంధించిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్గి వెంకటరెడ్డి, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలకు శంకుస్థాపన, పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని, తర్వాత ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తారని, వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్ వివరించారు. మంత్రుల సమీక్ష నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, సంబందించిన పూర్తి వివరాలతో హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, స్టాఫ్, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రతిపాదనలు సిద్ధం చేసుకోని వివరించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, వైద్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.