టేకులపల్లి – మహా
టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై మంగళ తోరణం కట్టడం జెండా ఊరేగింపు, ఆవిష్కరణ, శ్రీ గోవింద మాంబా సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి నవనీత అభిషేకములు ,అలంకరణలు ,మహా నివేదన ,మహా మంత్రపుష్పం ,మంగళ నీరాజనం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. టేకులపల్లి బ్రాహ్మణ గారి దేవాలయ కమిటీ మధ్యాహ్నం 12:30 గంటలకు నుండి అన్నదాన మహోత్సవం నిర్వహించారు.
Post Views: 110








