కుటుంబ అభివృద్ధికి మహిళలే కీలకమని మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్‌బాబు, ఎంపీడీవో సురేందర్, తహసీల్ధార్ ఎస్.సంపత్‌కుమార్ లు అన్నారు. బుధవారం కారేపల్లి మండలం రావోజీతండాలో మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడ బిడ్డ పుట్టిన తల్లిదండ్రులు సన్మానించి సర్టిఫికెట్, మిఠాయి అందజేశారు. ఈసందర్బంగా అధికారులు మాట్లాడుతూ నేడు మహిళలు అన్నిరంగాల్లో దూసుకపోతున్నారన్నారు. ఉగ్రవాదులపై నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూర్ లో యువతులు ముఖ్య భూమికి పోషించటం అభినందనీయమన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులు వివక్షత లేకుండా పిల్లలను సమాన దృష్టితో చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈ రవీంద్ర ప్రసాద్, ఐసీడీఎస్ సూపర్వైజర్ దేవేంద్ర, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Post Views: 47








