Mahaa Daily Exclusive

  వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..!

Share

హన్మకొండ మహా;

వరంగల్‌ పోలీస్‌ కమిషషనరేట్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యి కమిషనరేట్‌ కార్యాలయ అవరణలో జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని అలపించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సోమవారం అదాలత్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
పోలీస్‌ కమిషనర్‌ కమిషనర్‌ చేతుల మీదుగా చిన్నారులతో పాటు పోలీస్‌ సిబ్బందికి మిఠాయిలను అందజేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం….

ప్రతిభ కనబరిచిన సిబ్బందికి పతకాలను అందజేసిన మంత్రి

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వివిధ విభాగాల్లో విధుల్లో రాణించిన పోలీస్‌ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట సేవా, అతి ఉత్కృష్ట సేవా పతకాలను రాష్ట్ర ఆటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అందజేసారు. ఉత్కృష్ట సేవా పతకం అందుకున్న వారిలో కానిస్టేబుళ్ళు మల్లికార్జున్‌, వెంకటేశ్వర్లు, కుమారస్వామి, రాజు,యాదగిరి, శ్రీనివాస్‌, హోంగార్డులు అక్బర్‌ పాషా, వీరరాఘవ రావు, అశోక్‌ ఉన్నారు. అతి ఉత్కృష్ట సేవా పతకాన్ని అందుకున్న వారిలో ఏ.ఎస్‌.ఐ రాజయ్య, హెడ్‌ కానిస్టేబుళ్ళు విజయ సేనా రెడ్డి, మహిపాల్‌ రెడ్డి,రాజు,ఉస్మాన్‌, మనోహర్‌, జాన్‌విల్సన్‌ (ఇతను చనిపోతే అతని కుటుంబ సభ్యులు స్వీకరించారు) బానోత్‌ యాకుబ్‌ వున్నారు. ఈ సందర్బంగా పతకాలను అందుకున్న సిబ్బందికి మంత్రి కొండా సురేఖ, తో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ జోన్‌ డిసిపి షేక్‌ సలీమా, అదనపు డిసిపిలు సురేష్‌ కుమార్‌, రవి, ప్రభాకర్‌ రావు తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు ఇతర విభాగాలకు చెందిన పోలీస్‌ పరిపాలన సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.