Mahaa Daily Exclusive

  భారాస కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండాను ఆవిష్కరించిన ఉద్యమ నేత నన్నపునేని ..!

Share

వరంగల్ మహా ;

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం వరంగల్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం తో పాటు పలు డివిజన్ల లో జాతీయ జెండా, బి ఆర్ఎస్ పార్టీ జెండాను వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు, ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉద్యమ నేత నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ….

తెలంగాణ రాష్ట్రం ఒక కల. ఆ కల కోసం ఎందరో యువతీ యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాలతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ త్యాగాలకు నివాళి అర్పించే పర్వదినంగా ఏర్పడిందన్నారు.
తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగాలు చిరస్మరణీయమని నరేందర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నా తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేయడం, నిరాహార దీక్ష చేపట్టడం, రాజకీయంగా ప్రతిఘటనలను ఎదుర్కొంటూ ప్రజల శబ్దంగా మారడం ఇవన్నీ ఉద్యమానికి ఊపునిచ్చాయని అన్నారు. 2001లో టీఆర్‌ఎస్‌ స్థాపనతో మొదలైన పోరాటం, 2014 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావంతో విజయవంతమైంది. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి, పదేళ్లపాటు తెలంగాణను అభివృద్ధి మార్గంలో నడిపించారు. నీటి ప్రాజెక్టులు, రైతు బంధు, విద్యుత్, సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని నన్నపునేని నరేందర్ గుర్తుచేశారు.
తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. వర్గాల మధ్య భేదాలు కాదు, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని మనం కలసి పనిచేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు దిడ్డి కుమార్ స్వామి, మరుపల్లి రవి, మాజీ కార్పొరేటర్లు భయ్యా స్వామి, కుందారపు రాజేందర్, కొంతం మోహన్, మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ బాబు, మాజీ ఆర్టీఏ మెంబర్ గోరంట్ల మనోహర్, డివిజన్ అధ్యక్షులు, ఇన్చార్జీలు, మహిళా నాయకురాలు, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.