Mahaa Daily Exclusive

  వైభవంగా శ్రీ మెట్ల బావి ధన మైసమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు..!

Share

వరంగల్ మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం
34 డివిజన్ లోని శ్రీ మెట్ల బావి ధన మైసమ్మ దేవి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా కదిలి వచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శనం చేసుకున్న వారిలో పుర ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వాణి దంపతులు, తో పాటు బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవి కుమార్, స్థానిక కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి శోభాయాత్రలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తోట బాబన్న, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, వరంగల్ తూర్పు మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, ముఖ్య నాయకుల తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.