Mahaa Daily Exclusive

  బల్దియా లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన నగర మేయర్ గుండు సుధారాణి..!

Share

వరంగల్ మహా;

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి కమిషనర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. మొదటగా తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపాటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మేయర్ మాట్లాడుతూ ఎందరో మేధావులు, మహానుభావుల తపన ఆకాంక్షల తోపాటు తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుకల్లో కార్పొరేటర్లు, బల్దియా ఉన్నతాధికారులు, అధికారులు, జేఎసి ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.