హన్మకొండ మహా;
హనుమకొండ లోని గోపాలపూర్ కు చెందిన అమ్మద్ యూసఫ్ అలీ శుక్రవారం ఉదయం వ్యాపార నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లి పని ముగించుకొని తిరిగి ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి తన వెంట బ్యాగ్ తీసుకొని అందులో ట్రిమ్మర్స్ (సెలూన్ ) షాప్ కు చెందినవి. టాక్సీ కార్ లో హనుమకొండ కు బయలుదేరి వస్తుండగా సాయంత్రం 6 గంటలకు నక్కలగుట్టలోని టీఎంసీ చేరుకోగానే తన వెంట తెచ్చుకున్న బ్యాగు కనిపించక పోయేసరికి వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం రంజిత్ కుమార్ కు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన సీఐ సీసీ కెమెరాల టెక్నీషియన్ అయిన పవన్ కుమార్ ను సంప్రదించి సీసీ కెమెరాల సహాయంతో పోగొట్టుకున్న బ్యాగులో సుమారు 1,50,000 విలువగల ట్రిమ్మర్స్ బ్యాగ్ ను తిరిగి యూసఫ్ ఆలీకి అప్పగించారు. ఇందుకు ఆయన సీఐ ఎం రంజిత్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 28








