రంగారెడ్డి జిల్లా మహా:
ఎలిమినేడు ప్రభుత్వ హాస్పిటల్ కు సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు మంకాల విజయమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎలిమినేడు ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు మంకాల విజయమ్మ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆస్పత్రికి మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పేదలు వైద్యం కోస ప్రతిరోజు 70 మంది రోగులు ఎలిమినేడు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. తుర్కగూడ, కప్పపహాడ్, ఎలిమినేడు, మాదాపురం, జబ్బర్ గూడ, పోచారం గ్రామాల నుంచి వస్తున్నారని తెలిపారు. కానీ వచ్చే రోగులకు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి సరిపడా సిబ్బంది ఉన్న అటెండర్ లేరన్నారు. వెంటనే ఎలిమినేడు ఆసుపత్రికి అటెండర్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. వైద్యం పేదలకు అందరి ద్రాక్షగా మారిందన్నారు. కనుక పేదల కోసం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలకు సౌకర్యాలు పెంచి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల కార్యదర్శి దేవరకొండ ఇందిరా పాల్గొనడం జరిగింది.








