Mahaa Daily Exclusive

  క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకే కాంగ్రెస్ పార్టీ లో గుర్తింపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సన్నాక సన్నాహక సమావేశంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు..!

Share

కాటారం, మహా : కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నుండి కష్టపడి పని చేసే, ప్రజాభిమానం కలిగిన నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందని పదవుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదని పదవులు లేకుండా కార్యకర్తలు పార్టీ కోసం పని చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్జిల్లా శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కాటారం, మాలహర్ మండలంలోని తాడిచర్ల గ్రామంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అన్నాక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్ లింగాజీ, పరిశీలకులు కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ నిర్దేశించిన వ్యక్తిని గెలిపించే విధంగా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని, పార్టీకి విరుద్ధంగా పోటీ చేసే వారిని సహించే ప్రసక్తి లేదని సున్నితంగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి పటిష్టం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రత్యేక ప్రణాళికతో సంస్థాగత ఎన్నికల కార్యాచరణ రూపొందించారని అదే అమలు చేస్తున్నారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మండల శాఖ అధ్యక్ష పదవులకు కాటారం, మాలహార్ మండలాల్లో పలువురు నామినేషన్ దాఖలు చేశారు. మూడు నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎంపిక చేసిన అభ్యర్థులను గెలిపించేందుకు ఇప్పటినుండే కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు అర్హులైన ఆశావాహులను ఎంపిక చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పార్టీ పదవులు లేదా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోట రాజబాబు, వేమునూరి ప్రభాకర్ రెడ్డి, పంతకాని సమ్మయ్య , వోన్న వంశవర్ధన్ రావు, చీమల సందీప్, కారెంగల తిరుపతి, తెప్పెల దేవేందర్ రెడ్డి, కుంభం రమేష్ రెడ్డి, గద్దె సమ్మిరెడ్డి, నాయిని శ్రీనివాస్, ఆంగోతు సుగుణ, కుంభం స్వప్న,జాడి మహేశ్వరి, ఎలుబాక సుజాత, శకుంతల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.