రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చేవెళ్ల నియోజవర్గం బీఆర్ఎస్ మాజీ అసెంబ్లీ ఇంచార్జ్ దేశముల ఆంజనేయులు తెలిపారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో ఇళ్ల ముందు వర్షపు నీరు నిల్వ ఉండ కుండా చూసుకోవాలని తెలిపారు. వర్షపు నీరు నిలువ ఉండడం వల్ల దోమలు స్వైరవిహారం చేస్తాయని, దోమల ద్వారా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, బోదకాలు తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. జ్వరంలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని ప్రజలకు తెలిపారు.
Post Views: 32








