Mahaa Daily Exclusive

  కారోబార్ల ను అన్యాయం గా అరెస్ట్ చేశారు..!

Share

కాటారం, మహా : ఇంట్లో నిద్రిస్తున్న మమ్మల్ని పోలీసులు వివరాలు తెలుసుకోకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారని కాటారం మండల కారోబార్లు ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ లో కారొబార్ల చే కమీషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలిగించనప్పటికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచారని తెలం గాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యునై టెడ్ అసోసియేషన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సాదుల శ్రీకాంత్
యూనియన్ కన్వీనర్ దోమల శ్రీనివాస్ అన్నారు. గురువారం అర్థ రాత్రి అరెస్టులు చేయడం బాధాకరమని అన్నారు. సిఐటియు యూనియన్ వాళ్లు హైద రాబాద్ లోని కమిషనర్ ముట్టడి కొరకు వెళ్తే పోలీసులు వివరాలు తెలుసుకోకుండా ముందస్తు అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు.కనీసం మంచినీళ్లు భోజనం లేకుండా వదిలి పెట్టడం బాధాకరమని అన్నారు. శ్రీనివాస్ వెంట యూనియన్ సభ్యులు మెండ మల్లి కార్జున రావు,చిట్యాల శశికుమార్, బోర్లకుంట రవి,ఆత్కూరి రవి,కొండయ్య ఉన్నారు.