రంగారెడ్డి జిల్లా మహా:
ఉప్పరగూడ సహకార సంఘం అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందుతున్నాయి. వ్యవసాయంలో మెలకువలు, సంఘాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై శుక్రవారం నిజాం కళాశాల, బేగంపేట్ డిగ్రీ విద్యార్థులకు, ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్ పాండురంగారెడ్డి సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో విద్యార్థులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ ప్రిన్సిపల్ భూక్యా వెంకన్న, సీఈవో గణేష్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 224







