Mahaa Daily Exclusive

  సమ సమాజానికి పునాదులు వేసిన సంఘ సంస్కర్త పీవీ: భట్టి

Share

TG: పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ తీసుకువచ్చిన భూ సంస్కరణలను సీఎంగా రాష్ట్రంలో అమలు చేసి సమ సమాజానికి పునాదులు వేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. పీవీ నరసింహారావు మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణమని తెలిపారు. రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకువచ్చిన అనేక సంస్కరణలు సమాజానికి గొప్ప మేలు చేశాయన్నారు.