కారేపల్లి, మహా : కారేపల్లి మండలం బొక్కలతండా గ్రామంలో ఆదివారం ఆషాఢమాస బోనాల వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గ్రామదేవతలైన బొడ్రాయి కి మహిళలు జలాభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా మేళతాళాలు, డప్పు నృత్యాల మధ్య మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ముత్యాలమ్మ అమ్మవార్లకు పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. బోనాల వేడుకల్లో దేవతామూర్తుల వేషదారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాల వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈబోనాల కార్యక్రమంలో గ్రామ పెద్దలు బానోత్ రాందాస్, మాలోత్ భావుసింగ్, అజ్మీర నారాయణ, మాలోత్ పత్య, వాంకుడోత్ బాబులాల్, భూక్య హతిరాం, హలావత్ రాంబాబు, కుమార్, లక్మ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 123








