Mahaa Daily Exclusive

  భద్రాచలం మైన పట్టుదల… లండన్ దాకా ఆదివాసి మహిళల మిల్లెట్ విజయం. ప్రధాని మోడీ ప్రశంసలు…!

Share

భద్రాచలం, మహా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ గుంపు ఆదివాసి మహిళలు తమ సమష్టి శ్రమతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్నారు. వారు తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్లు ప్రస్తుతం దేశవిదేశాల్లో ముచ్చటగా మారాయి. వారే కాదు – శానిటరీ నాప్కిన్ల తయారీలోనూ స్వయం ఉపాధితో ముందంజ వేసిన వీరి కథ, అభివృద్ధి కోరుకునే గ్రామీణ మహిళలకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. నేటి మనకి బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ కథను దేశం ముందు ఉంచారు.

భద్రాచలం నుంచి లండన్ దాకా ‘మిల్లెట్ మ్యాజిక్’
ప్రధాని మోదీ తన ప్రసంగంలో “భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్” పేరిట ఆదివాసి మహిళలు తయారు చేస్తున్న బిస్కెట్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సేంద్రియంగా ఉత్పత్తి చేస్తున్న ఈ మిల్లెట్ బిస్కెట్లు ఇప్పుడు హైదరాబాద్ నుంచే కాకుండా లండన్‌కు కూడా ఎగుమతవుతున్నాయన్న విషయం దేశం దృష్టిని ఆకర్షించింది. భద్రాచలం, దుమ్ముగూడెం, చింతూరు ప్రాంతాల నుండి సేకరించిన మిల్లెట్లు (సామలు, కొర్రలు, వరగులు) ఆధారంగా ఈ బిస్కెట్లు తయారు అవుతున్నాయి.

మహిళా సాధికారతకు మోడీ సెల్యూట్
ఈ బిస్కెట్ల తయారీతోపాటు, అదే మహిళల బృందం తక్కువ సమయంలో భారీ పరిమాణంలో శానిటరీ నాప్కిన్లను తయారు చేయడాన్ని ప్రధాని అభినందించారు. “ఇవే మహిళలు మూడు నెలల వ్యవధిలో 40,000 శానిటరీ నాప్కిన్లను తయారు చేసి విక్రయించారు. ఇవి స్థానికంగా అమ్ముడవుతూనే, స్వచ్ఛమైన మహిళా ఆరోగ్యానికి దోహదపడుతున్నాయి. వారి శ్రమ, విజ్ఞానం, పట్టుదల చూస్తే దేశానికి గర్వపడేలా ఉంది” అని మోదీ అన్నారు.

వాటికే మార్గదర్శకం… పల్లెకు పునాదిరాయి
ఆదివాసీ మహిళలు నూతన ఆర్థిక మార్గాల్లోకి అడుగుపెడుతున్న విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించడం, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామీణ యువతకి, మహిళా స్వయం సహాయక బృందాలకు ఈ సంఘటన ఒక మార్గదర్శకంగా మారనుంది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ పట్ల అవగాహన పెరిగితే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మన్నించదగిన స్థాయిలో ముందుకెళ్తుందనే విషయంలో ప్రధాని సందేశం ఎంతో ప్రేరణాత్మకం.

సాంప్రదాయ ధాన్యాల ఆధారంగా, స్థానికంగా లభించే వనరులను వినియోగించుకుని ఆదివాసీ మహిళలు సాధించిన ఈ గౌరవం రాష్ట్రానికే కాదు, దేశానికే గర్వకారణం. ఒకప్పుడు అడవిలోని గ్రామాలలో చిన్న స్థాయిలో మొదలైన ఈ ప్రయాణం, లండన్ బజార్ల వరకూ సాగడం వెనుక ఉన్న శ్రమకు మోదీ సెల్యూట్‌ చేయడం, వారికి మరింత ఉత్సాహాన్ని కలిగించనిదిగా అర్ధం అవుతోంది.

భద్రాచలం మహిళలు చూపిన ఈ విజయం – మిల్లెట్ మ్యాజిక్‌ బిస్కెట్ల రూపంలో ప్రపంచ మార్కెట్‌ దాకా పయనించి, సాంకేతికతతో పాటు సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇది మహిళా సాధికారతకు ఒక చక్కటి ఉదాహరణ.