నిజామాబాద్, మహా: ముందే ప్రారంభించిన పసుపు బోర్డు తాత్కాలిక కార్యాలయాన్ని మరో భవనంలోకి మార్చి కేంద్రమంత్రి అమిత్‌షా మళ్లీ ప్రారంభించారని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అద్దె భవంతిలో రెండోసారి ప్రారంభోత్సవం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమిత్‌షా నిజామాబాద్ పర్యటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. పసుపు రైతులు మద్దతు ధర కావాలనే కోరుతుంటే.. తాత్కాలిక భవంతులు రెండు సార్లు ప్రారంభించి ఏమారుస్తున్నారని మండిపడ్డారు. సభ పసుపు రైతుల కోసం కానీ, అమిత్‌షా రాజకీయాల గురించి మాట్లాడారని విమర్శించారు. బీజేపీ ఫెలయిన ఆపరేషన్ సిందూర్, బీఆర్ఎస్, నక్సలైట్ల అంశాలపై మాట్లాడారని చెప్పారు. కేంద్రమంత్రి ప్రసంగంలో పసుపు మద్దతు ధర, బోర్డు నిధులు, శాశ్వత కార్యాలయం ఊసే లేదన్నారు.
Post Views: 134








