Mahaa Daily Exclusive

  నాయకన్ గూడెంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ ..!

Share

కూసుమంచి, జూన్ 30, మహా:

కూసుమంచి మండలం నాయికన్ గూడెం గ్రామంలో కంచర్ల సుదీర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయిలపామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని అగ్రికల్చర్ , హార్టికల్చర్ అధికారులు సోమవారం ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో కూసుమంచి డివిజన్ ఏడీఏ సరిత, పాలేరు డివిజన్ ఉద్యాన అధికారి అపర్ణ, కూసుమంచి అగ్రికల్చర్ అధికారి రామడుగు వాణి, నాయకన్ గూడెం ఏఈవో సౌమ్య ప్రత్యేక పూజలు చేసి ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటల సాగు వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుందన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ అనిల్, రైతులు ఉపేందర్
రెడ్డి తదితరులు పాల్గొన్నారు.