కూసుమంచి, జూన్ 30, మహా:
చదువు మధ్యలో ఆపేసి, రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్లలేని వారికోసం సార్వత్రిక విద్యా విధానం ద్వారా చదువుకునే అవకాశాన్ని తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ కల్పిస్తున్నదని, అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కూసుమంచి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ వీరాస్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.వివిధ కారణాలు వలన పదవ తరగతి, ఇంటర్మీడియట్లో చదువు ఆపేసిన వారు మళ్లీ చదువు కొనసాగించడానికి చక్కటి అవకాశమన్నారు. జూలై 11వ తేది వరకు అడ్మిషన్ పొందవచ్చాన్నారు. పదో తరగతి చదువుకునే వారు టీసీ, బర్త్, కుల ధ్రువీకరణ పత్రము, ఆధార్ సర్టిఫికెట్లు, పాస్ పోర్టు సైజ్ ఫోటో, ఇంటర్ చదువుకు నేవారు పదోతరగతి మార్కుల పట్టిక, కులం, ఆధార్ సర్టిఫికెట్లు, పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో కూసుమంచి ఉన్నత పాఠశాలకు రావాలన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లకు ప్రభుత్వం గుర్తింపు ఉంటుందని, ఉన్నత చదువులు, పదోన్నతులు, ఉద్యోగాలకు కూడా అర్హత ఉంటుందని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు కూసుమంచి సెంటర్ కో ఆర్డీనేటర్ టి. శోభన్ బాబు 9948597174 నెంబర్‌ను సంప్రదించవచ్చు అని తెలిపారు.







