Mahaa Daily Exclusive

  ఐసీడీఎస్ విచ్చిన్నానికి పాలకుల కుట్ర శ్రమదోపిడి గురవతున్న స్కీమ్ వర్కర్లు సీఐటీయులో చురుకైన నాయకురాలు మహబూబీ..!

Share

కారేపల్లి, మహా:బహుళార్ధక ప్రయోజనాలు కల్పిస్తున్న ఐసీడీఎస్ ను విచ్చిన్నానికి కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సిఐటియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సింగరేణి మండల నాయకురాలు ఎస్.కే. మహబూబి సంస్కరణ సభ సిఐటియు సింగరేణి మండల కన్వీనర్ కే నరేంద్ర అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈసభలో కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఐసీడీఎస్ లో శ్రమ దోపిడి జరుగుతుందని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కరువైందన్నారు. అంగన్వాడీల హక్కులకై అంగన్వాడీలను ఐక్యపరచడంలో మహబూబీ కీలకపాత్ర పోషించిందన్నారు. క్రమశిక్షణతో అమలు చేయడంలోనూ సంఘాన్ని చీల్చి అంగన్వాడీల పోరాటాన్ని దెబ్బ కొట్టాలని కుట్రలను తిప్పి కొట్టటంలో మహబూబీ ప్రాత మరవలేనిదన్నారు. అంగన్ వాడీల సమస్యల పరిష్కారానికి అంగన్ వాడీ కార్యకర్తలకు తలలో నాలుకల వ్యవహరించిన ఎస్.కె మహబూబి జీవితం ధన్యమని కొనియాడారు. కేంద్రంలో అధికారం వెలక బెడుతున్న మోడీ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్ బిల్లులుగా అమలు చూస్తున్నదని వీటికి వ్యతిరేకంగా జులై 9న జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. కనీస వేతనం సంక్షేమ బోర్డు వారి హక్కుల రక్షణకై పోరాడాలని, మోడీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పకొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకుండా సమర్ధించే దోరణిలో ఉందన్నారు. వ్యతిరేకంగా కార్మికులను కూడగట్టి ముందుకు సాగాలని ఉదృతమైన పోరాటాలు నిర్వహించడమే మహబూబికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ సంస్మరణ సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణు శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ పి రమ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, అంగన్వాడీ యూనియన్ కామేపల్లి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ఎస్ నాగమణి, దుగ్గి పాపారాణి, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దుగ్గీ కృష్ణ, అధ్యక్షులు వజ్జ రామారావు, సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు ఎస్ఏ. నభి, కామేపల్లి మండల సిఐటియు నాయకుడు బాధావత్ శీను, రిటైర్డ్ సిడిపిఓ విజయలక్ష్మి, ఐద్వా సింగరేణి మండల కార్యదర్శి కె ఉమావతి, గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు గండమల్ల వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు దాచేపల్లి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ కురసం.సత్యనారాయణ, భూక్య లక్ష్మణ్, మెహబూబి భర్త ఎండి ఇస్మాయిల్, కుమారుడు దిశాదు పాషా, కుమార్తె అనిసా, రాణి, పద్మ ,జ్ఞానమ్మ, స్వరూప, భారతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Latest