Mahaa Daily Exclusive

  బీసీలు అంటే అభిమానం ఉన్న వ్యక్తి రేవూరి బిఆర్ఎస్ కు దళితులను అవమానించుడు శర మాములే ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి..!

Share

వరంగల్ మహా;

వరంగల్ నగరంలోని 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ నందు స్థానిక కార్పొరేటర్ బిఆర్ఎస్ నాయకులు చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ 16వ డివిజన్ కీర్తి నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ హుజుర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 16 డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ సోమవారం బిఆర్ఎస్ కార్పొరేటర్, కార్పొరేటర్ భర్త సుంకర శివ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సంతోష్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పాలనలో కమిషన్లు, అక్రమాలకు పాల్పడిన వారు ప్రజా ప్రభుత్వం పై స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని ప్రజలు మీ మాయ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని, పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసిన మిమల్ని ఈ కీర్తి నగర్ ప్రజలు మర్చిపోరని మీ బీఆర్ఎస్ పాలనలో ప్రజల గోడు వినకుండా ఇష్ట రాజ్యాంగా వ్యవహరించి భూ కబ్జాలకు, అక్రమాలకు పాల్పడి ఇప్పుడు కమిషన్లు లేక మతిభ్రమించి ఎమ్మెల్యే పై అసత్య ప్రచారాలు చేయడం సరైనది కాదని అన్నారు. అభివృద్ధి గురించి బిఆర్ఎస్. నాయకులు మాట్లాడటం దయ్యాలు వేదాలు విల్లించినట్లు ఉందని ఎద్దేవా చేసారు. పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి తరచు మహానగర పాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికి, అప్పుడు పరకాల నియోజకవర్గం పరధిలోని మూడు డివిజన్ ల సమాచారం తెలుసుకుంటూ ప్రజల కోసం శ్రామిస్తున్నాడని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందరికీ అందిస్తున్న నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అని సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న నేత రేవూరి ప్రకాష్ రెడ్డి అని వారి రాజకీయ అనుభవం అంత వయస్సు లేని వ్యక్తులు ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అని అన్నారు. అయన మీ పై కక్ష సంధించే వ్యక్తి కాదని వారు అలా చేస్తే మీరు చేసిన అక్రమాలు, ఆగహిత్యలకు మీరు మీ నాయకులు ఎప్పుడో జైలు జీవితం గడిపేవారని హెచ్చరించారు. ఇక సొంత పార్టీ నేతల పై మాట్లాడం లేదని, విమర్శించడం లేదనే విషయానికి వస్తే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా బీసీ నాయకుల పై ఎక్కడ మాట్లాడకూడదని ఆయన చెప్పారని బీసీలు అన్నా బీసీ నాయకులు అన్నా వారికి అమితమైన అభిమానం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం రేవూరి ప్రకాశ్ రెడ్డి అని అది కాంగ్రేస్ పార్టీ సిద్ధాంత గొప్పతనం అని కాంగ్రేస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మాత్రమే కాంగ్రేస్ పార్టీ నాయకులుగాని కార్యకర్తలుగాని పని చేస్తారు అని రెచ్చగొట్టే, చిచ్చులు పెట్టే నాయకులకు కాంగ్రేస్ పార్టీ లొంగదని స్పష్టం చేశారు. రానున్న రోజులలో బిఆర్ఎస్ తెలంగాణ లో కనుమరుగయి పోతుందని తాటాకు చప్పులకు బెదిరేది లేదని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ఎస్. కానరాకుండా పోవడం ఖాయమని మరీ ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకులకు జాతి, కుల వివక్ష ఉందనేది మరోసారి రుజువుయిందని అన్నారు. దళిత రత్నా అవార్డు గ్రహిత, బిఆర్ఎస్. 16వ డివిజన్ అధ్యక్షులు మేధోశక్తి కలిగిన వ్యక్తి పోగుల సంజీవ ను ఓ దళితుడనే ఉద్దేశంతో కావాలనే అవమానిచడం పద్ధతి కాదని అన్నారు. స్థానిక కార్పొరేటర్ భర్త సుంకర శివ మీడియా తో మాట్లాడుతుండగా మైక్ అతన్ని పట్టుకోమానటం సరైనది కాదని బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు సంజీవ కు క్షేమాపన చెప్పాలని డిమాండ్ చేసారు. దళిత నాయకులను రాజకీయంగా ఎదగనివ్వకుండా తరచు కులవివక్షతకు గురిచేయడం, అవమానిచడం బి ఆర్ఎస్. నాయకులకు శర మాములు గా మారిందన్నారు. గతంలో హన్మకొండ లో చల్లా ధర్మా రెడ్డి, నేరాళ్ల లో కేటీఆర్ లు దళితులను అవమానిస్తే ప్రభుత్వలే కూలిపోయాయి అని గుర్తుచేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే పంతాలు పట్టింపులను పక్కన పెట్టి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తో కలసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కొండేటి కొముర రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్, గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసారపు సారన్న , జానపాక గ్రామ అధ్యక్షులు ఎండి జానీ, గొర్రెకుంట గ్రామ అధ్యక్షులు ల్యాదల్ల సంపత్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెక్క లక్ష్మీ రమేష్, అఫ్రీన్, అంకేశ్వరపు రాజు, పిట్టల అనిల్, మౌనిక, గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు అజీముద్దీన్,మచ్చర్ల శ్రీనివాస్ ఎండి అంజద్ మునుకుంట్ల ప్రభాకర్ వెంకట్ మధుసూదనా చారి అవధూత శ్రీనివాస్, పరకాల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లెం సాయి ఏ రవీందర్ మీడియా ఇంచార్జి ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Latest