రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవోలకు, ఎంపీఓలకు, ఏపీఓ ఈజీఎస్ లతో సమీక్ష సమావేశం నిర్వహించనైనది. ఇందులో భాగంగా క్రింది అజెండా అంశాలు ఎస్ ఎస్ జి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2025, పంచాయతీ అడ్వాన్స్ ఇండెక్స్ 2023-24, ఎస్.బి.ఎం, సిటిజెన్ సర్వీసెస్, శానిటేషన్, వనమహోత్సవం, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ యావరేజ్ రేట్ అజెండా అంశాలు చర్చించడం అయినది. ఈ సందర్భంగా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ…. వన మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ ఆదేశానుసారము పిట్టింగు, ప్లాంటింగ్ తొందరగా పూర్తి చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వ ఆదేశానుసారం ప్రకారం తొందరగా పూర్తి చేయాలని, ప్రతిస్థాయిలో వారి విధులు బాధ్యతలు బాధ్యతగా చేయాలని కలెక్టర్ ఆదేశించినారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డిఆర్డిఓ ఎల్.శ్రీలత, డిపిఓ సురేష్ మోహన్, డిఈఓ సుశీందర్ రావు, డిఎల్పిఓలు, ఎంపీఓలు, ఈజీఎస్ల ఏపీఓలు మరియు పంచాయతీరాజ్ ఈ.ఈ.లు పాల్గొన్నారు.







