Mahaa Daily Exclusive

  జర్నలిస్ట్ రామ్ ప్రసాద్ మృత దేహానికి నివాళులు అర్పించిన ప్రెస్ క్లబ్ బాధ్యులు ..!

Share

హన్మకొండ మహా;

గుండెపోటుతో మృతిచెందిన వీడియో జర్నలిస్ట్ హరిణి రామ్ ప్రసాద్ మృతదేహానికి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు, వివిధ యూనియన్ల నేతలు, జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ తరపున 25 వేల రూపాయల తక్షణ సాయం అందజేశారు. సోమవారం గుండెపోటుతో మృతిచెందిన సీనియర్ వీడియో జర్నలిస్టు హరిణి రామ ప్రసాద్ మృతదేహాని కి మంగళవారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కు తరలించారు. క్లబ్ లో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్యలు రామ్ ప్రసాద్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. రామ్ ప్రసాద్ కు నివాళులు అర్పించిన వారిలో TUWJ (IJU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, TUWJH (143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, TWJF రాష్ట్ర కార్యద ర్శి బొక్క దయాసాగర్, సీనియర్ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, క్లబ్ కో శాధికారి బొల్ల అమర్, ఉపాధ్యక్షుడు బొడిగె శ్రీను, ఈసీ మెంబర్లు ఎండీ. నయీంపాషా, అంజనేయులు, దిలీప్ తదితరులు రామ్ ప్రసాద్ అమర్ రహే అని నినాదాలు చేసి 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

ఎమ్మెల్యేల సంతాపం
ప్రముఖ వీడియో జర్నలిస్టు హరిని రామ ప్రసాద్ ఆకస్మిక మృతిపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు మంగళవారం సంతాపం తెలియజేశారు. రామ్ ప్రసాద్ జర్నలిజం రంగంలో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో విజువల్ మీడియా సాక్ష్యాల రూపకల్పనలో విశేష సేవలు అందిం చారని, వారు గుర్తు చేశారు. రాం ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్యేలు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారు ఎదుర్కొంటున్న ఆర్థిక, మానసిక ఒత్తిడిలో ప్రభుత్వం తరఫున తమ వంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు.

Latest