వరంగల్ మహా;
వరంగల్ జిల్లాలోని
ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ లో విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిఇఓ ఆమోదంతో గవర్నింగ్ బాడీ రిజోల్యూషన్ ప్రకారమే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు వసూలు చేయాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు, షూస్ లాంటివి అమ్మకాలను నిషేధించాలన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం తోపాటు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా
పరిశుభ్రత పాటించాలని, బోగివిల్లా వంటి మొక్కలతో పాఠశాలల్లో ప్లాంటేషన్ చేయాలన్నారు. అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం
ఆధ్వర్యంలో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తొలగించుటకు ఇది వరకు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న స్ఫూర్తి కార్యక్రమాన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఈ సంవత్సరం నుండి నిర్వహిస్తామన్నారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు సేవించకుండా నిఘా ఉంచడంతోపాటు ప్రతి పాఠశాలలో మాదకద్రవ్య వ్యతిరేక క్లబ్బులను ఏర్పాటుచేసి ప్రతివారం విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వాడకం వల్ల జరిగే
అనర్ధాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. యూనిసెఫ్ సహకారంతో నిర్వహిస్తున్న స్నేహ క్లబ్లను ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రభుత్వం నిర్దేశించిన ఎన్సీఈఆర్టీ పుస్తకాలను వినియోగించి విద్యార్థులకు
బోధించాలన్నారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి అన్ని అమలయ్యేలా పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఈఓ జ్ఞానేశ్వర్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, తదితరులు పాల్గొన్నారు.







