Mahaa Daily Exclusive

  తమ భూమి వీరాసత్ చేయడానికి లంచమా? తలకొండపల్లి ఎమ్మార్వో నిర్వాకం ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు కుటుంబం 10000 తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలో గత సంవత్సర కాలం నుండి విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ నాగార్జునను మంగళవారం ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు, తన నలుగురు అన్నదమ్ములకు చెందిన పొలం విరాసతూ చేయడానికి, తలకొండపల్లి మండల ఎమ్మార్వో ను సంప్రదించగా మీ యొక్క భూమిని వీరాశక్తి చేయడానికి ఖర్చు అవుతుందని వారితో ఎమ్మార్వో తెలుపగా, మా యొక్క భూమి, మాకు వారసత్వంగా వచ్చిన భూమిని మా పేర్ల మీదకి రావడానికి, ఎమ్మార్వో లంచం అడిగారని ఏసీబీ అధికారులను సంప్రదించడంతో, ముందుగా కుదుర్చుకున్న 1,50,000 వేల ఒప్పందంలో కొంత రూ.10,000 లంచం తీసుకుంటుండగా తలకొండపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, కార్యాలయంలోని వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న యాదగిరి అనే ఉద్యోగి, రైతుల వద్ద నుండి నేరుగా రూ.10 వేలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలో ఎమ్మార్వో ను ఇతర ఉద్యోగులను విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Latest