Mahaa Daily Exclusive

  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుదాం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి..!

Share

కొత్తగూడెం, మహా.
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని.. సత్తా చాటుదామని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం లక్ష్మీదేవి పల్లి మండలంలోని బంగారు చెలక, మైలారం, గట్టుమల్ల, రేగళ్ల, లక్ష్మీదేవి పల్లి, చాతకొండ, సీతారాంపురం, తెలగ రామవరం, హేమచంద్రాపురం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశాలకు హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తున్నా.. పలుచోట్ల తడుస్తూ కూడా సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, పెద్దబాబు లతో కలిసి ఎంపీ రఘురాం రెడ్డి ప్రసంగించారు.
* స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి మరోసారి గట్టిగా బుద్ధి చెబుదామని కోరారు.
* రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింతగా వివరించాలన్నారు. రూ.22వేల కోట్లతో రైతు భరోసాను అమలు చేసిందని, రూ. 12వేల కోట్లతో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తోందని, 55 లక్షల ఇళ్లకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, ఉచిత బస్సు పథకానికి రూ.4 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు వివరించారు.
ఈ కార్యక్రమాల్లో.. ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest