మధిర, మహా.
మధిర మండలం వంగవీడు వద్ద నూతనంగా చేపట్టనున్న జవహార్ ఎత్తిపోతల పథకానికి ఈ నెల 3వ తేదీన భూమిపూజ జరగనుంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ మూడవ జోన్ నుండి రెండవ జోన్కు మార్పుతో మధిర, ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు అందించేందుకు రూ.630 కోట్ల నిధులతో మూడు పంప్ హౌస్లతో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంసత్ సభ్యుడు రాఘురాం రెడ్డి హాజరవుతారు.
భూమిపూజ స్థలాన్ని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, ఎర్రుపాలెం అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు కలిసి పరిశీలించారు. కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు తెలిపారు.








