భద్రాద్రి కొత్తగూడెం, జూలై 1 (మహా):
కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్దమైన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని, ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల అమలుకు సమరశీల పోరాటాలు తప్పవని,దానిలో భాగంగానే జులై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె కి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని, ఈ పిలుపుని జిల్లా లో అత్యంత జయప్రదంగా నిర్వహించాలని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. కొత్తగూడెం పట్టణంలో ఉన్న వివిధ కార్మిక పని ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేశారు.
కార్మిక సంఘాల జేఏసీ నాయకులు భూక్య రమేష్, గెద్దాడ నాగేష్, సంజీవ్, కాలంగు నాగభూషణంలు మాట్లాడుతూ, బ్రిటిష్ కాలంలోనే కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కరానికి,కార్మిక భద్రథ కి,సంక్షేమానికి అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకున్నారని అన్నారు.కార్మిక చట్టాలని కరోనా కాలంలో మోడీ ప్రభుత్వం ముజువాణి ఓటుతో పార్లమెంట్ లో మార్పులు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని అన్నారు.
కార్పొరేట్ యాజమాన్యాలను సంతృప్తి పరచడానికి,వారి ఆదాయాలను మరింత రెట్టింపు ఛేయడానికి,కార్మిక వర్గం ముల్గులు పీల్చి పిప్పి చేయడానికి నాలుగు లేబర్ కోడ్ లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.ఇప్పటికే దేశం లోని బిజెపి పాలిత రాష్ట్రాలలో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తున్నారని,బిజెపి మిత్రుడుగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాది పాలను పూర్తైనా సందర్భం లో కార్మికులకు ఎనిమిది గంటల పని స్థానంలో పది గంటల పని దినాన్ని అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసు పాలిత కర్ణాటక,రాజస్థాన్ లలో నాలుగు లేబర్ కోడ్ ల అమలుకు రంగం సిద్దం చేశారన్నారు.ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా,కార్మిక వర్గాన్ని తీవ్ర ఇబ్నదులకు గురి చేయడం తప్ప మరొకటి లేదన్నారు. కార్మిక చట్టాల పరిరక్షణ కొరకు జులై 9 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ని జిల్లా అన్ని రంగాల్లో అత్యంత జయప్రదంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ షాపింగ్ మాల్స్, ఆటో మొబైల్ కంపెనీల యాజమాన్యాలకు సమ్మె నోటీస్ లు అందించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు








