మంచిర్యాల, మహా : భారతదేశంలో 4 లేబర్ కోడులు అమలయితే కార్మికులు కట్టు బానిసలు అవుతారని సింగరేణి జేఏసీ కార్మిక సంఘాల నాయకులు (ఏఐటీయూసీ) వాసిరెడ్డి సీతారామయ్య, (ఐ ఎన్ టి యు సి) కాంపల్లి సమ్మయ్య, (సిఐటియు) నాగరాజు గోపాల్, (టీబీజీకేఎస్) మేడిపల్లి సంపత్, జి ఎల్ బి కే ఎస్(ఐఎఫ్టియు) రాములు వాక్యానించారు.
బుధవారం మందమర్రి ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు చట్టాలను భాజాపా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
ఎన్నో కార్మిక సమ్మెల ద్వారా సాధించుకున్న 44 చట్టాలను అలాగే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేందుకే భాజపా ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 9 నాటి ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు, ఇతర అన్ని వర్గాల కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో మందమర్రి ఏరియా గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి సాలేంద్ర సత్యనారాయణ, సివి రమణ, దాగం మల్లేష్, ల తో పాటు మిట్ట సూర్యనారాయణ, దార బిక్షపతి, పానుగంటి వెంకటస్వామి, రామగిరి రామస్వామి, అయిలయ్య, వీరారెడ్డి, తిరుపతి, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.








