Mahaa Daily Exclusive

  4న హైద‌రాబాద్ లో నిర్వహించే స‌మావేశాన్ని జయప్రదం చేయాలి -టీపీసీసీ కార్య‌ద‌ర్శి బ‌ద్దం ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి..!

Share

ఆదిలాబాద్, మహా:
ఈనెల 4న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే జైభీం , జైబాపు , జైసంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ కార్య‌ద‌ర్శి ,కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అడిష‌న‌ల్ ఇంచార్జి బద్దం ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. స్థానికంగా త‌న దృష్టికి వ‌చ్చిన‌ స‌మ‌స్య‌ల‌ను అధిష్టానం ముందు ఉంచుతాన‌ని తెలిపారు. శుక్ర‌వారం జ‌రిగే కార్య‌క్ర‌మంలో పార్టీ జాతీయ అధ్య‌క్షులు మల్లిఖార్జున ఖ‌ర్గే పాల్గొంటార‌ని నియోజ‌క వ‌ర్గంలోని ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హాజ‌రై విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం ముఖ్య‌మ‌ని అందుకు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ళాల‌ని పిలుపు నిచ్చారు.ఈ స‌మావేశంలో నాయ‌కులు గిమ్మ‌సంతోష్ , ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు గుడిప‌ల్లి న‌గేష్,మాజీ కౌన్సిల‌ర్లు సందా న‌ర్సింగ్, జ‌ఫార్ అహ్మ‌ద్,సుధాక‌ర్ గౌడ్, యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కులు శాంత‌న్ రావు, లోక ప్ర‌వీణ్ రెడ్డి, రావుల సోమ‌న్న‌, మ‌ల్ల‌య్యయాద‌వ్,రాజేశ్వ‌ర్ ,శ్రీ‌లేఖ‌, ల‌తా, సోనియా మంథ‌ని, ప్ర‌భావ‌తి, ఉయిక ఇందిర త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest